PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశిష్ట ఆభరణాలకు…‘మలబార్​’ ప్రత్యేకం..

1 min read
ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షోను ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ బుట్టారేణుక

ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షోను ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ బుట్టారేణుక

– ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షోను ప్రారంభించిన మాజీ ఎంపీ బుట్టారేణుక
పల్లెవెలుగు, కర్నూలు
అద్వితీయ మైన కళానైపుణ్యత… హుందాతనంతో కూడిన ఆభరణాలకు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ ప్రత్యకత చాటుకుందని మాజీ ఎంపీ బుట్టారేణుక అన్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు కర్నూలు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ హెడ్​ అస్నఫ్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షోను వినియోగదారుల సమక్షంలో మాజీ ఎంపీ బుట్టారేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారుల అభిరుచులకు తగ్గట్టు ఆభరణాలను ప్రదర్శిస్తూ… విక్రయించడం అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం కర్నూలు బ్రాంచ్​ హెడ్​ అస్నఫ్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా మాట్లాడుతూ ఆర్టిస్ర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా తమ సంస్థ బ్రాండుల సమూహారం ‘ మైన్​’ ధ్రవీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం ‘ ఎరా’ అన్కట్​ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి ‘ ప్రెష్యా ’ జాతి రత్నాభరణాల సముదాయం, ‘ఎత్నిక్స్​’ హస్తకళానైపుణ్యతతో రూపొందించి ఆభరణాలు తదితర ప్రత్యేక ఆభరణాలను షోలో ఉంచామన్నారు. వినియోగదారుల అభిరుచులు తగ్గట్టు ఆభరణాలను ఏర్పాటు చేయడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు.



About Author