ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
1 min readఇంటర్మీడియట్ విద్యార్థులకు డిసెంబర్ 31 వ తేది నాటికి అపార్ కార్డుల జనరేషన్ 100 శాతం పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపు పై ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షల్లో 37 శాతం మాత్రమే ఉత్తీర్ణత కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ పాస్ కావడం వల్ల వారి జీవితాలు మలుపు తిరిగే అవకాశం ఉంటుందన్నారు..అందువల్ల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు మొక్కుబడిగా కాకుండా ప్రొఫెషనల్ గా తీసుకుని విద్యార్థులకు బోధన చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. స్టడీ అవర్లు ఏర్పాటు చేసి, షెడ్యూల్ రూపొందించుకుని అన్ని సబ్జెక్టు లు బోధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..ఇప్పుడు ఉన్న తరంలో విద్యార్థులకు ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా ఉందని, ఏదైనా సులభం గా అర్ధం చేసుకునే సామర్థ్యం ఉందని, వారికి సరిగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్తే కచ్చితంగా పాస్ అవుతారని కలెక్టర్ అభిప్రాయ పడ్డారు. ప్రిన్సిపల్స్ యాక్టివ్ గా ఉండాలన్నారు..రేపే లెక్చరర్లతో ఈ అంశంపై సమీక్షించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని అమలు చేయాలన్నారు..పాస్ పర్సంటేజ్ తగ్గితే ప్రిన్సిపల్స్, లెక్చరర్లు బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల, నందవరం లో 84 శాతం పాస్ ఉత్తీర్ణత సాధించినప్పుడు.. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, బి.క్యాంప్ కర్నూలు, మంత్రాలయం లలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడం ఏంటని కలెక్టర్ సంబంధిత మండలాల ప్రిన్సిపల్ లను ప్రశ్నించారు..కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు? ఏ సబ్జెక్టు లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు? అన్న విషయాల పై విశ్లేషణ చేశారా?? రానున్న అర్ధ వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత ఏ విధంగా పెంచాలనే అంశంపై ఏదైనా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారా? అని కలెక్టర్ సంబంధిత ప్రిన్సిపల్ లను అడిగి తెలుసుకున్నారు.. డిసెంబర్ నెల 17 నుండి అర్ధ వార్షిక పరీక్షల ఫలితాల్లో పురోగతి కచ్చితంగా కనపడాలన్నారు… కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కౌతాళం, గూడూరు, కోసిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా పురోగతి తక్కువగా ఉందని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత ప్రిన్సిపల్ లను ఆదేశించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరమేశ్వర రెడ్డి, ఆర్ఐఓ గురువయ్య శెట్టి, ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపల్ లు పాల్గొన్నారు.