PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్టు 10వ తేదీ దళిత క్రైస్తవులకు బ్లాక్ డే

1 min read

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఆర్డిఓ కి వినతి పత్రం

నగరంలో దళిత క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దళిత క్రైస్తవులను దళిత ఎస్ సి లుగా గుర్తించి రిజర్వేషన్ లు కల్పించాలని ఏలూరు నగర దళిత క్రైస్తవ సంఘాలు శనివారం ఏలూరులో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. జేవియర్ బిషప్ హౌస్ నుండి నగర్ ప్రధాన రహదారులలో ప్రారంభమైన ర్యాలీ ఎస్సీలు గా గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలతో ఏలూరు కలక్టరేట్ కు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు,ఈ సందర్భంగా  దళిత క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ గత 74 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు 10వ తేదీన  దళిత రిజర్వేషన్ కోసం దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని క్రైస్తవ నాయకులు తెలిపారు.74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు రాజ్యాంగ బద్దంగా అందాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందనీయకుండా పక్ష పాత వైఖరితో అడ్డుపడుతుందని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశార, దళిత క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తూ,వారికి అందాల్సిన రిజర్వేషన్ ల ను అందనీయకుండా దళిత క్రైస్తవుల పట్ల పక్షపాత వైఖరితోను ,వివక్షతతోను,కక్ష పూరితం గాను అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులతో 3వ పేరాను రాజ మార్గాన కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా దొడ్డి దారిలో ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లను దక్కనీయకుండా అడ్డు పడ్డారని అప్పటి జాతీయ మతాల కమీషన్ తో పాటు జస్టిస్ రంగనాధ్ మిశ్రా లు పేర్కొన్నాయని ,మైనారిటీల సంఘం ఆరోపించిన ట్టు ఏలూరు జిల్లా దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాదర్ తోట ఆంటోనీ రాజు , పాదర్ జి మోజెస్, పాదర్ మైఖేల్, ఫా:చైతన్య రాజు, ఫా: జాకోబ్ మరియు దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరికే వరప్రసాదరావు, చర్మకారుల సంఘ జాతీయ అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ , అబ్రహం మాస్టారు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లు కల్పించాలంటూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

About Author