ది ఏలూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంకు (టేకు బ్యాంక్)111వ వార్షికోత్సవం
1 min readఐదు బ్రాంచ్ లుగా శాకోప శాకులుగా విరాజిల్లుతుంది
అన్ని వర్గాల వారికి అందుబాటులో తక్షణ రుణ సౌకర్యం
ఏలూరు ప్రజల మన్ననలు అందుకుంటూ, దినదిన అభివృద్ధి చెంది ముందుకు సాగటం గర్వించదగ్గ విషయం
చైర్మన్ అంబికా ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ది ఏలూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టేకు బ్యాంక్) 1914 సంవత్సరంలో వ్యవస్థాపకులు వల్లూరి రామారావు స్థాపించారు. ప్రస్తుతం ఐదు బ్రాంచ్ లుగా ఏలూరు కెనాల్ రోడ్, ఆర్ఆర్ పేట, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, విజయవాడ, శాకోప శాఖలుగా దిన దిన అభివృద్ధి చెందుతూ విరాజిల్లుతుంది. కెనాల్ రోడ్డు అగ్రహారంలో టేకు బ్యాంకు 111వ వార్షికోత్సవ కార్యక్రమం చైర్మన్ అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ వల్లూరి రామారావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆనాడు స్థాపించిన ఈ బ్యాంక్ వ్యాపార అభివృద్ధికి వ్యాపారవేత్తలకు, చదువుల నిమిత్తం విద్యా రుణములకు, గృహ నిర్మాణాలకు, అందరికీ అందుబాటులో ఉండేవిధంగా సకాలంలో బంగారంపై రుణాలు అందించటం బ్యాంకు ముఖ్య ఉద్దేశం అన్నారు. మనం జన్మించక ముందు స్థాపించిన ఈ సంస్థ అందరికీ సహాయపడుతూ ఏలూరు ప్రజల మన్ననలు అందుకుంటున్న మన ది ఏలూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టేకు బ్యాంక్ )ఏలూరు ప్రజలు గర్వించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో సీఈఓ ఎం అచ్యుత రావు, బ్రాంచ్ సిబ్బంది మరియు ఖాతాదారులు, తదితరులు పాల్గొన్నారు.