PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో 113.99 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

1,2 తేదీలలో ఎన్టీఆర్ భరోసా నూరు శాతం లబ్ధిదారులకు అందజేత 

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో రెండు లక్షల 66 వేల 867 మందికి  113. 99 కోట్లు నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వె ట్రి సెల్వి తెలిపారు. గురువారం ఉంగుటూరు,పాతూరు గ్రామాల్లో పింఛన్లు సూర్యోదయానికి ముందే ఇంటింటికి నగదు పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు  పత్స కుట్ల ధర్మరాజు తో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ సొమ్మును పింఛన్ దారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పదకం ద్వారా రెండు లక్షల 867 మందికి 113.99 కోట్ల రూపాయలు నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు1, 2 తేదీలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ నూరు శాతం పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే ఉంగుటూరు, పాతూరు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పింఛన్దారులకు నగదును అందజేయడం జరిగిందని చెప్పారు . జిల్లాలో 5187 సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందిని నియమించడం జరిగింది అన్నారు .ఏ కారణం చేతైనా ఆగస్టు ఒకటో తేదీన పింఛను  తీసుకొని వారికి రెండవ తేదీన అందించడం జరుగుతుందన్నారు ముందుగానే పింఛన్ దారులకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు.వృద్ధ్యాప్య పెన్షన్లు లక్షా 33 వేల  289 మందికి 53 కోట్ల 31 లక్షల 56 వేల రూపాయలు,  వితంతు పెన్షన్లు 68 వేల 153 మందికి 27 కోట్ల 26 లక్షల 12 వేల  రూపాయలు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు 33 వేల  780 మందికి 20 కోట్ల 26 లక్షల, 80 వేల  రూపాయలు,  31, 645 ఇతర పెన్షన్ దారులకు 13 కోట్ల 14 లక్షల 84 వేల  500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పత్సకుట్ల ధర్మరాజు మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉండి ఆర్థిక స్థితి లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి 3,000 పింఛన్ ను 4000 రూపాయలు పెంచిందని , సూర్యోదయానికి ముందే పించన్దారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి నగదును అందజేస్తున్నారని చెప్పారు. ఇజం దారులు  సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి డాక్టర్ విజయ రాజు ఏలూరు ఆర్డీవో ఎన్. ఎస్.కె .ఖా జవల్లి, ఎంపీడీవో లు, శర్మ స్వర్ణలత, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ప్రజా ప్రతినిధులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author