మధ్యాహ్నం 12: 20 నిమిషాలకే మూసివేసిన మహానంది ఆలయం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో ఆలయం మధ్యాహ్నం 12: 20 నిమిషాలకు మూసివేయడంతో భక్తులు అనేక ఇబ్బందు ఎదుర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్తర ద్వారా దర్శనం కొరకు రాగా ఉత్తర ద్వారా తలుపులు మూసి ఉంచడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆలయం మధ్యాహ్నం 12: 30 కి మూసి వేసిన అనంతరం తిరిగి 2 గంటలకు పునః దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయ గేట్లు మూసివేయడం ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. పండుగ, పర్వదినాల్లో నిరంతర దర్శనం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.