ఏలూరు జిల్లా నూజివీడులో జాబ్ మేళాకు1256 యువత హాజరు
1 min read34 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా 571 మంది వివిధ కొలువులకు ఎంపిక
ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఎస్.ఎ.సి ఆడిటోరియం ట్రిపుల్ ఐటి క్యాంపస్ నూజివీడు ఏలూరు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళా కు 1256 మంది యువత హాజరు అయి 571 మంది వివిధ కొలువులకు ఎంపిక చేసినట్లు ఏలూరు జిల్లా నైపుణ్యభివృది సంస్థ అధికారి ఎన్. జితేంద్ర బాబు తెలిపారు. ఈ జాబ్ మేళా లో 34 కంపెనీల ప్రతి నిధులు పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు జిల్లా డి.ఎస్.పి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, డిఆర్డిఎ పిడి ఆర్. విజయరాజు, ట్రిపుల్ ఐటి డైరెక్టర్ అమరేంద్ర కుమార్,తదితరులు పాల్గొన్నారు.