ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సి నియమించి ఐ ఆర్ ను ప్రకటించాలి
1 min readముఖ్యమంత్రి కి ఆఫ్టా వినతి
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తమ క్యాంప్ ఆఫీసులో వుండవెల్లి నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్టారాష్ట్ర అధ్యక్షులు ఏ జి ఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు రాష్ట్ర సహాధ్యక్షులు ఎంజి మహది మరియు కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవా లాల్ నాయక్, ఎం మధుసూధన్ రెడ్డి మరియు హాజరైనారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఉద్యోగులకు పిఆర్సి కమిటి ని నియమించి ఐ ఆర్ ప్రకటించాలని అలాగే ఇప్పటివరకు ఉద్యోగులకు బాకీ ఉన్న 35000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరడమైనది. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తు వీలైనంత త్వరగా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబందించిన అన్ని బకాయిలు చెల్లిస్తాం అని తెలియ చేసారు , ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ లకు ఓటు హక్కు కల్పించే చర్యలు తీసుకోవాలి అని కోరగా ముఖ్య మంత్రి వర్యులు ఖచ్చితంగా పరిశీలిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయుడిని 21 మంది దాటితే రెండో ఉపాధ్యాయుని ఉండేలాగా నిర్ణయం తీసుకోమని, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 100 దాటినచో అక్కడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోస్టులు క్రియేట్ చేయాలని మరియు ఆ పాఠశాలకు ఒక పిఈటిని వ్యాయామ ఉపాధ్యాయుడిగా నియమించాలని , ఉద్యోగుల బదిలీల చట్టంలో మినిమం జీరో సర్వీసును అనుమతించాలని , గతంలో ఉన్న జీవో 3 ని పునరుద్ధరించి గిరిజన ప్రాంతవాసులకు లబ్ధి చేకూరేలా చేయాలని, ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు పోస్టుతో పాటు ఒక పీఈటి పోస్టులు సాంక్షన్ చేయాలని ,సమగ్ర శిక్ష లో పని చేసే ఉద్యోగులకు డి ఎస్ సి యందు ప్రాధాన్యత మార్కులు కేటాయింపు చేయాలి అని లేఖ ద్వారా ముఖ్య మంత్రి ని కోరడం జరిగింది.