ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం మన అదృష్టం ఎందుకంటే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం నేడు 136వ జయంతి సందర్భంగా జరప్పుకోవడం చాలా సంతోషకరమైన విషయం మౌలానాస్వాతంత్ర సమరయోధుడు. మన భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో పోరాడి కఠిన కారాగార శిక్ష అనుభవించి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతదేశ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఎనలేని కృషి విద్యా కోసం అనేక సంస్కరణలు తెచ్చి విద్యా నికి అధిక ప్రాధాన్యత ఆ మహానీయుల కు ఈరోజు ఆయన జయంతి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో జన సంరక్షణ సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. 1888 నవంబర్ 11న మక్కా పట్టణంలో జన్మించారు మౌలానా అబుల్. కలాం ఆజాద్ . మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ భారత స్వాతంత్ర సమర ముఖ్య నాయకులలో ఒకరు. మౌలానా ప్రాక్యత పండితుడు కవి అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ అనేక భాషలలో ప్రావీన్యుడు. ఆయన భారతదేశానికి 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు భారత భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నారు. 19 58 ఫిబ్రవరి 22న మౌలానా తుది శ్వాస విడిచారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశ ప్రభుత్వం ఆయన సేవకు గుర్తించి 1992లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది ఆయన జన్మదినం జాతీయ విద్యా దినోత్సవం గా కూడా ప్రకటించి భారత జాతి తన గౌరవాన్ని చాటుకుంది ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.