టిడిపి కార్యాలయంలో ఘనంగా 155 వ గాంధీ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి కార్యక్రమాలను ఎమ్మిగనూరు ఎమ్మెల్యేడా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా మొదట జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా గౌ డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆయన గురించి స్మరిస్తూ ….. జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 02వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ గ్రామంలో కరంచంద్ గాంధీ పుతలీ బాయి దంపతులకు జన్మించారని పేర్కొన్నారు. చిన్న తనం నుండే సేవాగుణం అలవరచుకొని, అబద్దాలు చెప్పే పరిస్థితులకు దూరంగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. అతని 13వ ఏటా కస్తూరిబాయి గారితో వివాహం జరిగినదని మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దంపతులకు 4 సంతానం. 1891లో పట్టభద్రుడై 1893లో దక్షిణాఫ్రికా లోని నాటల్‌లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించడం వలన ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, మహాత్మా గాంధీ గారు బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను గాంధీ గారు స్థాపించి సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. ఇది అతనికి కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారన్నారు. బోయర్ యుద్ధకాలం లో (1899–1902) అతను తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము అతని సేవలను గుర్తించి, పతకంతో సత్కరించిందన్నారు. 1914లో గాంధీ భారతదేశానికి మహాత్మా గాంధీ గారు తిరిగివచ్చారు. భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీ కి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. సత్యం అహింసా అనే నినాదంతో 1918లో చంపారణ్, ఖేడాలలో సత్యాగ్రహాలు నిర్వహించి ప్రజలను చైత్యన్య వంతులను చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ కి కుడి భుజంగా నిలిచారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసిందని పేర్కొన్నారు. 1919 ఏప్రిల్ 13న పంజాబు లోని అమృత్ సర్, జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము అని భావించి సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై ద్రుష్టి సారించి అవే సరైన మార్గాలని భావించారన్నారు. 1921లో భారత జాతీయ కాంగ్రెసుకు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గాలైన సత్యం అహింసా వాటిని మనందరం కూడా పాటిస్తూ ప్రజలలో మెలగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.