జననేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు ముఖ్య అతిధులుగా వీర శైవ లింగయ్యత్ కౌర్పొరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ మరియు మునిసిపల్ చైర్మన్. కె. ఎస్.రఘు విచ్చేసి దివంగత ముఖ్యమంత్రి, మహానేత స్వర్గీయ, డా”వై.యస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో డా” వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి,ప్రభుత్వ హాస్పిటల్ నందు పండ్లు,పాలు,బ్రెడ్స్ పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి,మహానేత, స్వర్గీయ డా”వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రగతి సాధకుడు.. సంక్షేమరథసారథి.ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది.పాలన అంటే ఎలా ఉండాలో మహానేత చూపించారు.దేశంలోని అనేక రాష్ట్రాలు నివ్వెరపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు. ఆ పథకాలను రద్దు చేసేందుకు ఏ ప్రభుత్వం సాహసించ లేదంటే అతిశయోక్తి కాదు.ఆరోగ్య శ్రీతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందింది,రైతులకు ఉచిత విద్యుత్, ఫీజురీయింబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు బహుళ ప్రజాదరణ పొందాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు వాటికి పేర్లు మార్చుకొని అమలు చేస్తున్నాయి. వైఎస్సార్ పాలన నేటికీ ఆదర్శమే.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ కొమ్ము రాజశేఖర్,కౌన్సిలర్లు కాశీం బేగ్,కామర్తి నాగేశప్ప,డిస్ కేశవరెడ్డి,నీలకంఠ,బజారి, వాహిద్,రాజారత్నం, సుధాకర్,కో ఆప్షన్ మెంబెర్స్ అబ్రార్,గట్టు ఖాజా, వార్డు ఇన్చార్జిలు రుద్రాక్షల బజారి, చంద్రశేఖర్, సోమేశ్, విశ్వనాథ్, శ్రీ రాములు,నాగేంద్ర,తార రాజశేఖర్,వడ్డే వీరేష్,నాయకులు గడ్డం నారాయణ రెడ్డి,పోలయ్య, భాస్కర్,శ్రీనివాస్ రెడ్డి,కాశీం బేగ్,బాషా,శ్రీధర్ రెడ్డి,పామన్న, నరసింహులు,జి.యం బాషా,రఘునాథ్ రెడ్డి,బజారి,అల్తాఫ్,గోకారి,మంజునాథ్,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.