లోక్ అదాలత్లో 176 నగరపాలక కేసులు పరిష్కారం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం జాతీయ లోక్ అదాలత్లో నగరపాలక రెవెన్యూ విభాగానికి సంబంధించి 176 కేసులు పరిష్కారం అయ్యాయి. వివిధ పన్నులకు సంబంధించి వాణిజ్య దుకాణాలకు నగరపాలక అధికారులు గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 14 వరకు మొత్తం 1459 నోటీసులు జారీ చేయగా, వాటిలో 176 కేసులకు శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో పరిష్కారం లభించాయి. కార్యక్రమంలో ఆర్ఓలు ఇశ్రాయోలు, జునైద్, ఆర్ఐలు, ప్రత్యేక అధికారులు, అడ్మిన్లు, తదితరులు పాల్గొన్నారు.