ఫిబ్రవరి 1ని పెన్షన్ విద్రోహ దినముగా పాటించాలి
1 min readఏఐపిటిఎఫ్ సెక్రటరీ జనరల్ కమలకాంత్ త్రిపాఠి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శిక్షక్ భవన్ జనక్ పురి న్యూ ఢిల్లీ : అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఎ ఐ పి టి ఎఫ్) మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఈ రోజు అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్ డి బ్లాక్ జనక్పురి నందు జరిగింది . గత డిసంబర్ 2 వ తేదీన కొచ్చి కేరళ లో జాతీయ కార్యవర్గ ఎన్నికలు జరిగాక నూతన సంవత్సరం లో జరుగుతున్న మొదటి సమావేశానికి ఎ ఐ పి టి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు బసవరాజ్ గురికర్ అధ్యక్షత వహించారు , జాతీయ సెక్రటరీ జనరల్ కమలా కాంత్ త్రిపాఠి పర్యవేక్షణలో జరిగింది.ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆప్తా రాష్ట్ర అధ్యక్షుడు ఎ. ఐ.పి టి ఎఫ్ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి ఎ జి ఎస్ గణపతి రావు, తెలంగాణ నుంచి వైయస్ శర్మ జాతీయ కార్యదర్శి ఏఐపిటిఎఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం లో ముఖ్యంగా నూతన పెన్షన్ విధానాన్ని, జి పి ఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే దాకా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 1 ని పెన్షన్ ద్రోహ దినంగా ,బ్లాక్ డే గా పాటించాలని తీర్మానించారు , దేశవ్యాప్తంగా ఉపాధ్యాయు లందరికీ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెల్లించే జీతాలను (ఢిల్లీ లో చెల్లిస్తున్నారు) ఒకే దేశం ఒకే జీతం ఇవ్వాలని అందుకోసం పోరాడుతాం తీర్మానించారు.రాబోయే కార్యవర్గ సమావేశం ఏప్రిల్ లో బెంగుళూరు లో జరుగుతుంది అని, రాబోయే అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య ద్వై వార్షిక సమావేశం 2025 నవంబర్ లేదా డిసెంబర్ లో ఢిల్లీలో జరుగుతుందని దీనికి దేశీవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువమంది ప్రాథమిక ఉపాధ్యాయులు పాల్గొనాలని అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ సెక్రెటరీ జనరల్ కమలకాంత్ త్రిపాటి పిలుపునిచ్చారు, ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేరళ నుంచి హరి గోవిందన్, తమిళనాడు నుంచి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రింగరాజన్, ఉత్తరప్రదేశ్ నుంచి జాతీయ ఆర్థిక కార్యదర్శి మనోజ్ కుమార్ కర్ణాటక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నూల్గి మరియు 25 రాష్ట్రాల ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం నేతలు పాల్గొన్నారు.