PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగుల సంజీవిని 2016 వికలాంగుల చట్టం…!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక వెలుగోడు  పట్టణంలోని పాత బస్ స్టాండు లో ఉన్న వికలాంగుల హక్కుల పొరట సమితి… నంద్యాల   ఏ పి కార్యాలయంలో వికలాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో VHPS మండల  అధ్యక్షులు కె అబ్దుల్ రవూఫ్ మరియు జె ఇన్తియజ్  మాట్లాడుతూ…..ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచి అందజేయడం జరిగిందని,అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన  గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వికలాంగుల బాధలు చూస్తే గుండె కరిగిపోతుందని, ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మిమ్మల్ని గౌరవించేలా, మిమ్మల్ని అవమానపరిచిన ఇబ్బంది పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లా బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతానని హామీ ఇవ్వడం జరిగిందని  ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రేపు అసెంబ్లీలో జరిగే సమావేశాలలోనే 2016 వికలాంగుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల చట్టాన్ని ఆమోదించి ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా రాష్ట్రంలో  గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరిన కూడా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రివర్యులుశ్రీనారా చంద్రబాబు నాయుడుగారు , నారా లోకేష్ గారు, బిజెపి పెద్దలు కూడా వికలాంగుల సంజీవిని అయిన 2016 వికలాంగుల చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే పూర్తిస్థాయిలో అమలు చేసి వికలాంగుల జీవితాలలో వెలుగు నింపాలని,అదే విధంగా వికలాంగులకు apsrtc బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం,ఇంటి స్థలాలు అంతోదయ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ,కె అబ్దుల్ రవూఫ్,,ఇన్తియజ్  కూటమి ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో VHPS మండల నాయకులు రహాంతుల్లా,శ్రీను,మన్సుర్,ఖలీల్,సుమతీ,  లక్షుమయ్య,వెంకటరమణ, రాముడు,కిషొర్ కుమార్,పుష్పలత,ఎల్లమ్మ, ముక్తరున్   సుంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author