పిజిఆర్ఎస్ లో 217 అర్జీలు స్వీకరణ
1 min readఅర్జీ పరిష్కారంలో అలసత్వం సహించేదిలేదు
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)కు సంబంధించి అర్జీలు జిల్లా అధికారులు తమ లాగిన్ ను ఓపెన్ చేసి ఏరోజు కారోజు పరిశీలించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, మున్సిపల్ కమీషనరు ఎ. భాను ప్రతాప్ లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ లో 217 అర్జీలు వచ్చనట్లు తెలిపారు. లాగిన్ ఓపెన్ చేసి చూడటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని పూర్తిస్ధాయలో అవగాహన కలిగివుండాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా అధికారులను ఆదేశించారు.జిల్లా అధికారులు పిజిఆర్ఎస్ లో జిల్లాలోని అర్జీల పరిష్కారానికి సంబంధించి సొంత లాగిన్ ను ఓపెన్ చేసి ప్రతి అర్జీని పరిశీలించి అర్జీల పరిష్కారనికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని, అర్జీలు రీఓపెన్ లేకుండా అధికారులు శ్రద్దవహించాలని సూచించారు. అందిన అర్జీలలో కొన్నిభీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన చింతల రవికుమార్ ప్రమాద వశాత్తు తన కాలుపోయినందున ఎటువంటి పనులు చేయలేని నిస్సాహిత స్ధితిలో ఉన్నానని, అర్ధికంగా తమ కుటుంబం ఇబ్బందులు పడుతుందని, తాను విద్యావంతుడునని కావున తనకు ఏదైనా ఉపాధికల్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీని అందజేశారు. విజయవాడ అర్బన్ పటమట కు చెందిన ఎం. సంధీప్ నూజివీడులో తమకు ఉన్న వ్యవసాయ భూమికి పాస్ పుస్తకం ఇప్పించమని అర్జీ అందజేశారు. వంగూరు కు చెందిన ధర్మరాజు తమ పొలానికి ఆనుకొని టేకుచెట్లు వేశారని దానివల్ల తన పంట పొలం దెబ్బతింటున్నదని వీటిని తొలగించి తన పంటపొలాన్ని రక్షించమని కోరుతూ అర్జీ అందజేశారు. ముదినేపల్లి మండలం పేరూరు గ్రామానికి రాజేష్ చెందిన తమ భూమికి ఆన్ లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు.సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.