PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం గోడపత్రికలు విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : పశు సంరక్షణ సమాచారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 25/10/2024 నుండి 28/02/2025 వరకు ప్రతి గ్రామంలో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం నిర్వహించబడును.మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు మీ పశువుల సమగ్ర సమాచారం తద్వారా పశుగణ రంగ పథకాలు రూపకల్పనకు సహకరించండి.మన రాష్ట్రంలో 21.173 గ్రామాల పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలు నమోదు చేయుచున్నట్లు పేర్కొంది. పశువుల రకాలు గేదెలు గొర్రెలు మేకలు పందులు, గుర్రాలు వివిధ రకాల కోళ్లు పక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువులపై జాతుల వారిగా సమాచారాన్ని సేకరించినది. పశు గణనను ప్రతి ఐదు సంవత్సరాల ఒక్కసారి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాస హాయకుడు జిలాన్ టిడిపి యువ నాయకులు,సీనియర్ నాయకులు,గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author