గోదావరి జిల్లాల స్ఫూర్తి ప్రదాత సర్ ఆర్థర్ కాటన్ 221వ జయంతి
1 min readఇరిగేషన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యం,డేటా కాంప్లెక్స్ లో కార్యక్రమo
పెద్ద ఎత్తున పాల్గొన్న ఇంజనీర్లు సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో గోదావరి జిల్లాల స్ఫూర్తి ప్రదాత సర్ ఆర్థర్ కాటన్ 221 వ జయంతి ని ఇరిగేషన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు ఒకటిన్నర శతాబ్దం క్రింద గోదావరి నది కి వరదలు వచ్చినా ప్రవాహం ఎక్కువగా వున్నా నీరంతా సముద్రం పాలవుతూ ఉండేది.ఆ సమయంలో బ్రిటన్ ప్రభుత్వం లో పని చేస్తున్న కాటన్ దొర తనకున్న కొంతమంది అనుచరులతో గుర్రం మీద తిరుగుతూ ఉభయగోదావరి జిల్లాల్లో కాల్వల నిర్మాణం కోసం సర్వే చేసి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ప్రతి నీటి బొట్టు ను సాగు నీరు గా మార్చి ఈ రెండు జిల్లాలు నేటికి సస్యశ్యామలం గా ఉండటానికి కారణ భూతుడిగా అవతరించి అనేక గ్రామాల్లో నివసించే ప్రజలకు తాగునీరు అందిచిన అపర భగీరథుడని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవ ప్రకాష్. ఇంజినీర్లు కె. రాజు. బాబూరావు. అర్జున్. బొట్టా శ్రీనివాస్. ప్రిసిల్లా.పంజా కిషోర్.మిదిలేష్, రిటైర్డ్ ఇంజినీర్ ముక్కామల కృష్ణా రావు ఇరిగేషన్ సిబ్బంది నోరి శ్రీనివాస్. మధుసూదన్. వెంకటపతి రాజు జె పి ఏ ఓ వై. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.