24 గంటలు మీ సేవకుడిగా ఉంటా: ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: 24 గంటలు ప్రజలకు మీకు సేవకుడిగా ఉంటానని సోమవారము RCM చర్చి లో జరిగిన ఆదోని క్రైస్తవ ఐక్య సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని అన్నారు.ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఈరోజు ఒక పార్టీ నాయకుడిగా కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని కలవడానికి ఒక MLA గా అధికారికంగా రావడం జరిగింది. ప్రతి క్రైస్తవున్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మాట ఇచ్చారు. పార్టీలకతీతంగా, మతాలకుతీతంగా సేవా చేయడమే ప్రధాన కర్తవ్యమని పూర్తిస్థాయిలో నా బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నరు. నేను ఆదోని కి ప్రథమ సేవకుడిని, మిమ్మల్ని కలవటం నాకూ ఆ దేవుడి ఇచ్చిన ఆజ్ఞగా భావిస్తున్న,లోకానికి రక్షించడానికి ప్రభువు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆదోనీని రక్షించడానికి , సేవా చేయడానికి నాకి ఈ అవకాశం ఆ ప్రభువే కల్పించడాని అన్నారు.కమ్యూనిటీ హాల్, పాస్టర్స్ కాలనీ, పాస్తర్స్ వేతనము , స్మశన వాటిక సంబంధించిన సమస్యలు పరిష్కరా దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ సంఘం అధ్యక్షలు ఆనంద రాజ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.