24 న కురువల కార్తీక వనభోజనం :ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ ల కార్తీక వనభోజనం ఈనెల 24న ఆదివారం జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్ లోని ఏపీ మోడల్ స్కూల్ సమీపము న గల శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ఆవరణము నందు జరుగు వనభోజనం కరపత్రాన్ని మంగళవారం ఉదయం ఎంపీ బస్తిపాటి నాగరాజు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి, పాల సుంకన్న, శ్రీ లీలమ్మ, పెద్దపాడు ధనుంజయ, వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎంపీ బస్తి పాడు నాగరాజు మాట్లాడుతూ పార్టీలకతీతంగా జిల్లాలోని కురువ కులస్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తవుడు శ్రీనివాసులు, కేసీ నాగన్న, బి. సి.తిరుపాల్, పెద్దపాడు పుల్లన్న, బస్తిపాడు రమణ, పెంచికలపాడు వెంకటరాముడు, పందిపాడు బీష్ముడు తదితరులు పాల్గొన్నారు.