30 రోజుల జైలు శిక్ష..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలం ఎం సి ఫారం కు చెందిన ఈ శ్యామ్ అనే వ్యక్తి కి 30 రోజుల జైలు శిక్ష విధించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. మద్యం సేవించి అక్కడికి వచ్చి పోయే మహిళలను, ఎం సి ఫారం లో ఉన్న కాలేజీ లోనికి వెళ్లి విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడంతో కేసు నమోదు చేశామన్నారు. కోర్ట్ లో హాజరు పరచగా నిందితునికి రెండవ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. నిందితుని నంద్యాల సబ్ జైలుకు తరలించామన్నారు.