జాతీయ రోడ్డు భద్రత 36 వ మాసోత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని బళ్లారి చౌరస్తా లో జాతీయ రోడ్డు భద్రత 36 వ మాసోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు. ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి చౌరస్తాలో మ్యాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీట్ బెల్ట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌లోడ్ ప్రయాణికులు, వాహనాల నిర్వహణ, ఓవర్ స్పీడ్, ప్రయాణికుల పట్ల మర్యాదపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజా నాయక్, ఎం వి సుధాకర్ రెడ్డి, లు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలి, వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు, ముఖ్యంగా వాహనాదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు, అధిక వేగం రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు, అదేవిధంగా ఆటో రిక్షా లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. వాహనదారులకు రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజ నాయక్, ఎం వి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి బాబు కిషోర్ ఎన్ గణేష్ బాబు, డాక్టర్ జెశన్ అహ్మద్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుళ్లు చలపతి, వి విజయభాస్కర్, మరియు హోంగార్డులు, వాహనదారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.