భక్తిశ్రద్ధలతో 38వ పడిపూజ….
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: హరి హర పుత్ర శ్రీ అయ్యప్ప స్వామి 38వ పడిపూజను ప్యాపిలి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 97 మంది అయ్యప్ప స్వాముల మాలా ధారణ స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 6గంటలకు దేవాలయంలోని మూల విరాట్ కి పంచామృత అభిషేకం తో పాటు వీబూది,చందనం,పన్నీరు, పుష్పాభిషేకం చేసి అనంతరం గురు స్వామి నాయుడు , లక్మి రంగయ్య,గురు స్వామి కిరణ్ కుమార్,శ్రీను,మధు స్వామి ల ఆద్వర్యం లో ఉత్సవ విగ్రహానికి ఉదయం 10 గ కు మాలధారణ భక్తుల చే పంచామృత, భస్మం,గంధం, పూలు,పన్నీరు,జలాభిషేకలను మాలధారణ భక్తులచే చేయించి, పడి పూజ,కర్పూర హారతులు ఇప్పించు తీర్థ,ప్రసాదాలు ఇచ్చారు.ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రాజా నారాయణ మూర్తి పర్యవేక్షణ లో భక్తులకి అన్నదానం నిర్వహించారు. ఈ పూజకు పట్టణంలోని ప్రజలు ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి పూజించుకుని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదని స్వీకరించి అన్నదాన ప్రసాదాలు కూడా స్వీకరించారు. అనంతరం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ప్యాపిలి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించి భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనాని కల్పించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.