4 నుండి సుంకప్ప తాత ఉరుసు ఉత్సవాలు
1 min read4 న గంధం, 5 న ఉరుసు, 6 న జియరత్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లోని నాగలదిన్నే రోడ్డు లో వెలసిన శ్రీ సుంకప్ప( వన్నురసాబ్) తాత ఉరుసు మహోత్సవాలు గ్రామ ప్రజలు, భక్తుల అధ్వర్యంలో ఈ నెల 4 వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని దర్గా పీఠాధిపతి ఖాజాహుశేన్ తాత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 వ తేదీన గంధం తాత వంశస్థులు ఇంటి నుండి దర్గా వరకు ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 5 వ తేదీన ఉరుసు మహోత్సవం కులమతాలకుఅతీతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని 6 వ తేదీ జియరత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉరుసు రోజు రాత్రి అన్నదానం, భజన లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందు కోసం గ్రామ పెద్దలు, భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.