PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

40 డిమాండ్ల సాదనతోనే బీసీలకు బంగారు భవిష్యత్తు

1 min read

పల్లెవెలుగు వెబ్  నంద్యాల : మండల్ సూచించిన 40 డిమాండ్ల సాదనతోనే బీసీలకు బంగారు భవిష్యత్తు: మండల్ డే సందర్భంగా పేర్కొన్న పాండురంగ యాదవ్. నంద్యాల జిల్లా సమాజ్వాది పార్టీ కార్యాలయంలో మండల్ డే కార్యక్రమం జరిగింది. సమాజ్వాది పార్టీ రాయలసీమ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మండల్ చిత్రపటానికి పూలమాలవేసి తదనంతరం మండల్ యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆగస్టు ఏడవ తారీఖున బీసీల జన్మదినంగా మండల్ డే మనమంతా ఘనంగా జరుపుకోవాలని మండల్ స్ఫూర్తిగా ఆయన కోరిన 40 సిఫార్సులను అమలు చేయాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం , 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవం తర్వాత భారతదేశ చరిత్రలో గుర్తుంచుకోవలసిన మూడవ అతిపెద్ద సంఘటన 1990 ఆగస్టు ఏడవ తేదీ గా మనమందరం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనువాదం మాయాజాలం నుండి ప్రతి ఒక్క బీసీ యువకులు బయటకి రావాలని బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే మండల మహాశయుని ఆశయ సాధన తోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన బీసీ యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాది రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్ తో పాటు సమాజ్వాది పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పేరుగు శివ కృష్ణ యాదవ్, సమాజ్వాది పార్టీ మహిళా విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ ఫరిదాబి, అంబేద్కర్ వాహిని జిల్లా అధ్యక్షులు ఎనకండ్ల మధు , జిల్లా కార్యదర్శి నక్క రాజేష్, బీసీ సెల్ అధ్యక్షులు పిక్కిలి హనుమంత్ కుమార్, బీసీ సెల్ నాయకులు పిన్నాపురం నాయుడు, ఎస్టీ సెల్ నాయకులు సోమ్లా నాయక్, మైనారిటీ నేత మహమ్మద్ రఫీ, మహిళా నాయకురాలు లక్ష్మి, షహన తదితరులు పాల్గొన్నారు.

About Author