PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

4,500 కోట్ల రూ. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

1 min read

సంక్రాంతి నాటికి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా  అధికారులు పర్యవేక్షించాలి

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వం

పాల్గొన్న పలు శాఖల అధికారులు కూటమి నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు మండలం పెదపాడు గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో  పలు అభివృద్ది పనులకు  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం – రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి పల్లె పండగ ద్వారా 4500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం అసలైన గ్రామ స్వరాజ్యానికి నాంది పలికింది – పాలకులు పనికిమాలిన వాళ్ళు అయితే రాష్ట్రం, గ్రామాలు ఏ విధంగా సర్వ నాశనం అవుతాయి అనేందుకు గత 5 ఏళ్ళ వైసిపి పాలన నిదర్సనం – పెదపాడు మండలంలో పల్లె పండగ ద్వారా ఈరోజు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశాం – పెదపాడు గ్రామంలో రూ.50లక్షల రూపాయలతో అభివృధి పనులు చేపట్టగా, అధ్వాన్నంగా ఉన్న తోటగుడెం పెదపాడు రహదారిని మరో 10లక్షల రూపాయలతో  నిర్మిస్తాం – సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రతినిత్యం పనుల పురోగతిని పర్యవేక్షించాలి – గ్రామంలో అధ్వాన్న స్థితిలో తన గేదెలను మేపుతు ఇబ్బంది పెడుతున్న పాడి రైతు కొరపాటి తిరుపతికి రూ.2లక్షల 10 వేల రూపాయలతో తిరిగి కట్టే అవసరం లేకుండా పూర్తి సబ్సిడీతో మినీ గోకులాన్ని మంజూరు చేయటం జరిగింది. ఇదే విధంగా పెదపాడు మండలంలో మరిన్ని మిని గోకులాలు మంజూరు చేయటంతో పాటు,సీసీ రోడ్లు,డ్రైన్ నిర్మాణాలు చేపట్టి గ్రామ ప్రజలకు అన్ని విధాల మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి అండగా ఉంటామని, సూపర్ సిక్స్ నీ త్వరలోనే సూపర్ సక్సెస్ గా అమలు చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారూ.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, జన సేన నియోజకవర్గ ఇంచార్జి ఘంటసాల వెంకట లక్ష్మి, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, కూటమి నాయకులు గుత్తా అనిల్, సహా పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author