4 ఆగస్టు అంజుమన్ స్కాలర్షిప్ లు పంపిణి … ఖుద్దుస్
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రతి సంవత్సరంలాగే ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంజుమన్ స్కాలర్షిప్ లు ఆగస్టు నెల 4వ తేది ఆదివారం ఉదయం 10గం.కు ఆర్ టి సి బస్టాండ్ ఎదురుగా వున్న అంజుమన్ షాది ఖానాలో పంపిణీ చేస్తున్నట్లు ‘ది నంద్యాల అంజుమన్ ట్రస్టు’ చైర్మన్ నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. నంద్యాల పట్టణ పరిధిలోని 2024 సం.పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ధరాఖాస్తు చేసుకున్న 350 మంది పేద ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నగదు చెక్కు గా రూ.3000/- పంపిణి చేస్తున్నట్లు ఖుద్దూస్ తెలిపారు. విద్యార్థులు తప్పక ఆదివారం హాజరై ఈ కార్యక్రమం సఫలికృతం చేయాలని శ్రీ ఖుద్దూస్ తెలిపారు.