5 బిలియన్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) విజయవంతంగా విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (బిఎస్ఇ: 511700), ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ( ఎన్ బి ఎఫ్ సి), తన మూలధన నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మరియు వ్యాపార వృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపేందుకు రూ. 5 బిలియన్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) విజయవంతంగా విడుదల చేసినట్లు ప్రకటించింది.ఈ మొత్తం నిధుల్లో రూ. 1.3 బిలియన్, సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు మరియు మెరుగుపరచడానికి వ్యూహాత్మకంగా కేటాయించబడింది. ఈ పెట్టుబడి ద్వారా ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంపొందించి, సంస్థకు కొత్త వృద్ధి మార్గాలను తెరవడం లక్ష్యం.ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం వ్యాఖ్యానిస్తూ, “ఈ ఎన్ సి డిల విజయవంతమైన విడుదల, మా వ్యాపార నమూనాపై మరియు అభివృద్ధి సామర్థ్యాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం. రూ. 1.3 బిలియన్‌ను కార్యకలాపాలకు కేటాయించడం మా మార్కెట్ స్థానాన్ని బలపరచడానికి మేము తీసుకుంటున్న పటిష్ట చర్యల్లో భాగం. షేర్ హోల్డర్లకు మరియు వినియోగదారులకు దీర్ఘకాలిక విలువ అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు. మిగతా నిధులను వ్యూహాత్మక అవసరాల కోసం, వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మరియు నికర అప్పుల తగ్గింపుకు ఉపయోగించనున్నారు.ఇటీవల, సంస్థ విద్యాసంస్థల కోసం జీరో-కాస్ట్ ఇఎంఐ పథకాన్ని ప్రకటించింది, ఇది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అందజేయడం ద్వారా విద్యా విధానాన్ని విప్లవాత్మకంగా మార్చనుంది.స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాలకు సరిపడే పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తూ, తన వాణిజ్య సేవా ప్రమాణాలను ప్రతిరోజూ మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.