5రోజుల ప్రకృతి వ్యవసాయ టి ఓ టీ శిక్షణా తరగతులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గత 5రోజులుగా రైతు సాధికార సంస్థ సౌజన్యంతో కడప డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నందు, డీపీఎం ఎస్ వి ప్రవీణ్ కుమార్ అద్వర్యంలో 36మండలాల నుండి ఉన్న ఏపిసిఎన్ఎప్ సిబ్బందిని 8బ్యాచులుగా విభజించి వారికి 5రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరిగుతోంది. భూమి మరియు వ్యవసాయం పుట్టుక , ప్రకృతి వ్యవసాయం లో ఇమిడి ఉన్న సైన్సు యొక్క ప్రాముఖ్యత, వాతావరణంలో రోజు వారీ మార్పుల, దానివల్ల మానవాళి మనుగడకు ఉన్న ముప్పు, ఆకస్మిక వర్షాలు అందుకు గలా కారణాల నుండి మొదలు క్షేత్ర స్థాయిలో రైతులతో సమన్వయ స్వీయ సంభాషణ లో భాగంగా రైతులతో సానుకూల మెలకువలు, వారికి వారి యొక్క మొబైల్ ఆపరేట్ పై డిజిటల్ మేలుకువల పై శిక్షణ, పంటల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ , జీవ ఉత్ప్రేరకాలు, మార్కెట్ నందు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత మరియు దాని గుర్తింపు, ఉత్పత్తులను మార్కెటింగ్ అనుసంధానం, అదనపు ఆదాయాని కై పిజిఎస్ సర్టిఫికేషన్ పై దాని యొక్క రైతులకు కలుగు లబ్ది, అదనపు ఆదాయం, ప్రీమియం ధర, మార్కెట్ నందు వాటి యొక్క డిమాండ్, ప్రస్తుతం పిజిఎస్ఉన్న వారి వద్ద నుండి తిరుమల తిరుపతికి స్వామి వారి లడ్డు ప్రసాదానికై మన కడప జిల్లా నుండి శనగలు ఇచ్చిన రైతులతో ముఖా ముఖి వారి మాటల్లో వారికి కలిగిన లబ్ది అనుభావాలను పంచడం అంతకు మించి వారికి కలిగిన ఆనందం కూడా పంచుకున్నారు, 5వ రోజు శిక్షణా కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో మోడల్స్ పై ప్రాక్టీకల్స్ లో భాగంగా చెన్నూరు లోని కొండ పల్లి అనిత అనే రైతుకు 20సెంట్ల విస్తీర్ణం లో ఎటిఎం మోడల్ ను శిక్షణకు హాజరైన వారితో వెపించడం, అక్కడి సుధాకర్ రెడ్డి రైతుకు జీవామృతం తయారీ, వారి లైన్ సోయింగ్ వరిలో గట్ల పై బంతి, వంగ, టమోటా, మిరప, నాటడం, మరియు లైవ్ ఫెన్సింగ్ లో భాగంగా సొర, బీర, కాకర లను పెట్టించడం, అలంకాన్ పల్లి నూర్జహాన్ రైతుకు 1000 కేజీల ఘన జీవామృతం తయారీ, అనంతరం అక్కడి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి. ముని రత్నమ్మ సమక్షంలో 6,7,8, తరగతులు పిల్లల తో అవగాహన నిమిత్తం 7-10 నిమిషాల నిడివి ప్రకృతి వ్యవసాయ నినాదాలతో ర్యాలీ చేయడం జరిగినది. రోజులో భాగంగా డీపీఎం ఎస్.వి. ప్రవీణ్ కుమార్ శిక్షణకు హాజరైన సిబ్బందిని ఉద్యేసించి వారి యొక్క విలువైన సందేశాలను , సూచన సలహాలను, రాబోవు రోజులు వ్యవసాయం ప్రకృతి సహాయంతో ప్రకృతితో మమేకం కానుంది. దీనికి మనము ఎంతో బాధ్యతతో మీ సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ, అదే ప్రకృతి వ్యవసాయాన్ని రైతులతో చేయిస్తూ ముందుకు వెళ్ళాలని అందరికి హితవు పలికారు. మనిషి జీవన విధానంపై , మన యొక్క ఆహారపు అలవాట్లు, మరియు ప్రస్తుత సమాజంలో మానవుడు రసాయన ఉత్పత్తులు తిని 100కి 70మంది రోగాల బారిన పడుతున్నారు . ఆర్ వై యస్ ఎస్ విజయ కుమార్ గారి ఆశయాన్ని మనము ప్రకృతి వ్యవసాయo చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. క్షేత్ర స్థాయిలో చెన్నూరు ఎం ఏఓ ఎటిఎం మోడల్ ను సందర్శించి పూర్తి స్థాయిలో వారి సమయాన్ని కేటాయిస్తూ ప్రపంచమతా ప్రకృతి వ్యవసాయం వైపు చూస్తోంది దానికి మిరే పునాదులనడంలో మీకు మీరే సాటి అని వారిని ప్రోత్సహించారు . క్షేత్ర స్థాయిలో విఏఏలు, వెలుగుబునుంది సి సిలు, ఇ వైపిలు రైతులు పాల్గొన్నారు .