శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం 5 లక్షల 4 వేలు అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 5,00,004 /-లను ( అయిదు లక్షల నాలుగు వేలను) శ్రీ వి. భాస్కరరావు తూర్పుగోదావరి జిల్లా వారు అందజేశారు. ఈ మొత్తాన్ని డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ కి అందజేయడం జరిగింది. కార్యక్రమములో అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు గంజి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేయబడ్డాయి.