50వేలు రూ. విరాళాన్ని ప్రకటించిన టిడిపి యువ నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: విజయవాడ వరద భాదితుల కోసం మండలంలోని టిడిపి యువ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చిన్నహ్యాట శేషగిరిలు ఒక్కొక్కరు రూ.50వేలు చొప్పున తమ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారంరోజులుగా మండల కేంద్రమైన హొళగుందతో పాటు అన్ని గ్రామాల ప్రజలు పార్టీలు, కుల, మతాలకు అతీతంగా వరద భాదితులకు సహాయం చేశారన్నారు. అందులో భాగంగా తమవంతుగా ఒక్కొక్కరు రూ.50వేలు చొప్పున విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపనున్నట్లు తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయానికై వరద భాదితుల సహాయ సమైక్య ఏర్పాటు అయినప్పటి నుండి సేకరించిన బియ్యం, నగదు మొత్తం కలిపి దాదాపు రూ.4లక్షలు జమఅయ్యిందన్నారు. ఇందులో మేముసైతం అంటూ తెదేపా యువ నాయకులు హెబ్బటం విష్ణువర్ధన్‌రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు చిన్నహ్యాట శేషగిరిలు రూ.50వేలు, రూ.50వేలు కలిపి మొత్తం రూ.5లక్షలు సేకరించినట్లు తెలిపారు. వరద బాధితుల సహాయంలో పాలుపంచుకుంటున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు డాక్టర్ తిప్పయ్య, దుర్గప్ప, తోక వెంకటేష్, మల్లికార్జున, దిడ్డి సిద్దప్ప, అశోక్, సుభాన్, చిదానంద, అబ్దుల్ హమీద్. అబ్దుల్ రెహ్మాన్ ఖాదర్భష, శ్రీరంగ, టిఎన్ఎస్ఎఫ్ మల్లి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.