PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

55లక్షల మద్యం స్వాధీనం…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  55 లక్షల రూపాయల గోవా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. నంద్యాల గిద్దలూరు రహదారిలోని గాజులపల్లె వద్ద ఉన్న అంతర్ జిల్లా చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నంద్యాల వైపు నుండి వస్తున్న రాజస్థాన్ కు చెందిన ఒక లారీలో తనిఖీలు నిర్వహించగా 950 చీఫ్ లిక్కర్ మద్యం కేసులు పడినట్లు పేర్కొన్నారు. మద్యంతో పాటు లారీని కూడా సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి డబ్బు మరియు మద్యం తరలింపు, పంపిణీ చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తమకు సమాచారం అందజేస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. గోవా నుండి అక్రమంగా మధ్యాన్ని  తౌడు సంచుల మధ్య ఉంచి రవాణా చేస్తున్నారని ప్రస్తుతం డ్రైవర్ తో పాటు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. నిధితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని మీకు ఎవరిపైన అయినా అనుమానాలు ఉన్నాయని ప్రశ్నించగా అసలైన ముద్దాయిలు దొరకలేదని విచారణ అనంతరం బయట పెడతామన్నారు. గోవా నుంచి విజయవాడ సమీపంలోని నరసరావుపేటకు మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ రవాణాకు కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఇతర దేశాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా  రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకు ఎవరు ఆ సూత్రధారి అనేది పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎస్పీ వెంట నంద్యాల డిఎస్పి రవీంద్రారెడ్డి తాలూకా సిఐ శివ కుమార్ రెడ్డి ఎస్బిసిఐ వెంకటేశ్వరరావు మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ గోస్పాడు ఎస్సై నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author