PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాబ్ మేళాకు 566 మంది ఎంపిక  నియామక పత్రాలు అందచేసిన ఎంపి

1 min read

ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమపై ఉంది, స్కిల్స్ నైపుణ్యంతో నేర్చుకోవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంది

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా యంపి పుట్టా మహీష్ కుమార్ మరో ముందడుగు వేశి జిల్లాలోని  నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జాబ్ మేళా ను ఏలూరులో గిరిజన భవన్ లో నిర్వహించారు.1226 మంది హాజరుకాగా 566 మంది ఎంపికైనారు.ఎంపికైన వారికి యంపి పుట్టా మహేష్ కుమార్ నియామకపత్రాలు అందచేశారు.  ముందుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా ను ప్రారంభించారు.అనంతరం జాబ్ మేళాను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకుల కోసం వారి నైపుణ్యల ప్రకారం ఈరోజున 11 కంపెనీలు వచ్చాయన్నారు. నైపుణ్యం లేని అభ్యర్థుల వలన కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమపై ఉందని ఎంపీ అన్నారు. స్కిల్స్ నేర్చుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పై ఉందన్నారు. కంపెనీలు లాభాల కోసం పనిచేస్తాయి నైపుణ్యం గల యువత కోసం చూస్తున్నాయి. వచ్చే రోజుల్లో మరిన్ని కంపెనీలు తెస్తాము. రెజ్యూమ్ లు పంపినంత మాత్రాన ఉద్యోగాలు రావు సంబంధిత విధాగం లో నైపుణ్యత పెంచుకోవాలన్నారు. వచ్చే రోజుల్లో పెద్ద ఐటి కంపెనీలు తీసుకువస్తామన్నారు. అందరికీ ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు కు పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తానన్నారు. స్కిల్  సెన్సెస్ చేయిస్తానన్నారు. స్కిల్ ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకువస్తానన్నారు.ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే వరకు స్థానిక యువతీ యువకులకు ఒక అన్నగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో  కాట్రు బాలు,మాగంటి హేమసుందర్,ముమ్మిడి చింతయ్య, నందిగం బాబి,కరణం పెద్దిరాజు,దాసరి అంజనేయులుస్థానిక కూటమి నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గోన్నారు. నిర్వాహకులు ఊహించిన దానికి మించి వేలాదిగా ఉద్యోగాల కోసం తరలి వచ్చారు.

About Author