పెదపాడు శాఖ గ్రంధాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
1 min readపాల్గొన్న మండల అధికారులు
దేశ పౌరులుగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే గ్రంథాలయాలే మూలం
ఎంపీడీవో ఎండి అమీలు జామ
గ్రంథాలయ అభ్యాసంతో విద్యార్థులు రాణించాలి
దుగ్గుపోవు జాన్ బాబు గ్రంథాలయ అధికారి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెదపాడు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించుట జరిగినది.ఈ ప్రారంభోత్సవమునకు పెదపాడు ఎంపీడీవో ఎండి.ఆమీలుజమ, పంచాయతీ కార్యదర్శి డి.వినోద్ కుమార్,ఎంపీడీవో ఆఫీస్ సూపరిండెంట్ రవికుమార్,ఎంపీపీ స్కూల్ హెచ్ ఎం వేల్పుల ప్రభాకర్,వీఆర్వో ఏ.నరసింహారావు, పెదపాడు మానవతా కన్వీనర్ కె.రామకృష్ణ,గురుకులం స్కూల్ హెచ్ ఎం ఆర్.బెంజిమెన్,ఎస్.వెంకటేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు హాజరైనారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటనికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమమునకు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు. వారికి బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ పంచ్ పెట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొనిన వారు అందరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని గ్రంధాలయం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియపరిచినారు. ఎంపీడీవో అమీలు జామ మాట్లాడుతూ దేశ అత్యున్నత పౌరులుగా ఎదగాలంటే గ్రంథాలయాలే మూలమని, గ్రంథాలయ పఠనంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు మాట్లాడుతూ ఈరోజు 14 నుండి 20వ తేదీ వరకు జరుగు గ్రంథాలయ వారోత్సవంలో విద్యార్థిని విద్యార్థులు విరివిగా వచ్చి గ్రంథాలయంలో నిర్వహించు వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ అభ్యాసంతో విద్యార్థులు చదువులో మరింత రాణించాలన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసి ప్రారంభించిన ఆహ్వానితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.