5వ రోజు పెదపాడు శాఖ గ్రంధాలయంలో జనరల్ నాలెడ్జ్, క్విజ్ పోటీలు
1 min read20వ తేదీ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ
పర్యవేక్షించిన గ్రంథాలయ అధికారి డి జాన్ బాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు శాఖా గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జనరల్ నాలెడ్జి మీద “క్విజ్ పోటీలు”నిర్వహించడం జరిగినవి.ఈ కార్యక్రమంలో పెదపాడు సెంట్ ఆగస్టీన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ,పెదపాడు చెడు పి పి హై స్కూలు,కొత్తూరు జెడ్ పి పి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు. ఈ కార్యక్రమం నిర్వాహకులుగా జసింతు సుల్య, హెచ్ఎం,వి. విజయలక్ష్మి,ఎండి. ఫౌజియా,సిహెచ్. శిరీష ,కే.జోషిలా,సెంట్ ఆగస్టీన్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు పి వెంకటేశ్వరరావు, హెచ్ఎం,జి.విజయ,టి. శ్రీనివాస్,జి. చంద్రశేఖర్,పెదపాడు జెడ్ పి పి హై స్కూల్ ఉపాధ్యాయులు నిర్వహించినారు.పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది.విజేతలకు 20వ తేదీ బుధవారం శాఖా గ్రంధాలయం నందు ఉదయం 10:30 గంటలకు బహుమతులు ప్రధానం చేయబడును,ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయాధికారి శ్రీ దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది. క్విజ్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియపరిచినారు.