రాజగోపురం నిర్మాణం కు 60 వేలు విరాళం…
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నరసింహ స్వామి దేవస్థానం శాశ్వత గోపుర నిర్మాణం కొరకు గుంతకల్ అనంతపురం వాస్తవ్యులైన జె. రంగరావు కుటుంబ సభ్యులు మంగళవారం రూ 60000 అందజేశారు. కార్యాలయంలో డొనేషన్ ఆఫీస్ నందు విరాళంగా చెల్లించి ఉన్నారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం స్వామి వారి శేష వస్త్రము లడ్డు ప్రసాదాలు ఆశీర్వాదాలు కల్పించి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా దాతలు భక్తులు మాట్లాడుతూ స్వామివారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విజయ్ కుమార్, దేవస్థానం ముఖ్య అర్చకులు రమేష్ స్వామి అర్చకులు శివపుత్ర స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.