PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి

1 min read

పదోన్నతి ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి

పదోన్నతి కాపీలు అందజేసిన డిపిఓ తూతిక శ్రీనివాస్

కుటమి ప్రభుత్వంలో రావడం సంతోషం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్సులకు, జూనియర్ సహాయకులకు పదోన్నతి అవకాశం కల్పించింది. దానిలో భాగంగా డైరెక్టర్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి శాఖ వారి ఆదేశాలు మేరకు జిల్లాలో 80  మంది గ్రేడ్-2 జూనియర్ సహాయకులు, సానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్సులుగా పదోన్నతికి అర్హత సాధించారు. అయితే వీరిలో 17 మంది వ్యక్తిగత కారణాలు వలన పదోన్నతి వదులుకోగా 63 మందికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పదోన్నతి ఉత్తర్వులు జారిచేసారు. సందర్బంగా గ్రేడ్-2గా పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్తర్వులు కాపీ తీసుకున్నారు.  పదోన్నతి కోసం ఏళ్ళ తరబడి నిరీక్షణ చేశామని, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని పంచాయతీ కార్యదర్సులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author