68వ రాష్ట్ర త్రో బాల్ పోటీల్లో విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇటీవల గుంటూరులో జరిగిన 68రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో కర్నూలు జిల్లా త్రోబాల్ పోటీలో కర్నూల్ నగర శివారులోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను చాటారు. రాష్ట్రస్థాయిత్రోబాల్ పోటీలలో కర్నూలు జిల్లాటీం కు కెప్టెన్ గా చిరంజీవి శివ వ్యవహరించాడు.. రాష్ట్ర ప్రభుత్వంవారు నిర్వహించిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో మనజిల్లామూడవ స్థానాన్ని, కైవసం చేసుకుంది .విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు,చి.శివ, మరియు శివశంకర్ తమప్రతిభను చాటుకున్నారు. బాలికల విభాగంలో కుమారి 9వ తేదీ విద్యార్థిని జిల్లా జట్టులో ఎంపిక కాబడింది. ఈ ముగ్గురు విద్యార్థులను ఈరోజు అనగా 30వ తేదీ డిసెంబర్ ఉదయం 10 గంటలకు స్థానిక విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో అభినందిస్తూ అభినందన సభ జరిగింది. ఈ సభలో విజ్ఞాన పీఠం కార్యదర్శి శ్రీ పి పి గురుమూర్తిగారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చదువులో భాగంగా ఆటలు ఉండాలని ,ఆటలలో నైపుణ్యాన్ని పొందినవాడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్ రామిరెడ్డి గని అభినందించారు.గురుమూర్తిగారు మాట్లాడుతూ విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల అంటే జిల్లాలో త్రోబాల్ పోటీలకు మరో పేరుగా నిలిచిందని తెలిపారు. ఈ పాఠశాల నుండి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి వరకు విద్యార్థులు వెళ్తున్నారనిఅన్నారు.ఈ కార్యక్రమంలో , శ్రీ చంద్ర మోహన్,శ్రీ సుదర్శనం, శ్రీ నివాసులు, శ్రీ నాగేశ్వర్ రెడ్డి, శ్రీ రాజశేఖరరెడ్డి ,శ్రీ వంశీ రాఘవ , శ్రీ హిమాయత్ పాల్గొన్నారు.