PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7 నెలల జీతాలను తక్షణం చెల్లించాలి… సిపిఐ

1 min read

శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటినెన్స్  కార్మికుల జీతాలు చెల్లించాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి:  ఏలూరు:శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయిన్ వర్కర్స్ కు చెల్లించాల్సిన 7 నెలల జీతాలను తక్షణం చెల్లించాలని శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శ్రీసత్యసాయిమెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ మూడవమహాసభ మండల కేంద్రమైన కొయ్యలగూడెంపట్టణంలో మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారంజరిగింది.ఈ మహాసభకు సంబంధించిన తీర్మానాలు, నూతన కమిటీ ఎన్నిక తదితర వివరాలను ఆదివారం సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు డేగా ప్రభాకర్ పత్రికలకు విడుదల చేశారు.ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ మహాసభ ప్రారంభానికి ముందు కొయ్యలగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు ఉత్సాహభరితంగా ర్యాలీ అనంతరం మహాసభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశామన్నారు.గత ఏడు నెలలనుండి శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ కార్మికులకుజీతాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారు 200 గ్రామాలకు పైగా గోదావరి గోదావరి జలాలను ఈ పథకం ద్వారా అందిస్తోందని తెలిపారు.ఈ పథకంలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.ఈ పథకానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని,అయితే గత ప్రభుత్వం నుండి కార్మికులకు ఏడు నెలల నుండి జీతాలు చెల్లించలేదని ప్రస్తుతం ఎనిమిదో నెల గడుస్తుందన్నారు.జీతాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ3వమహాసభలో  శ్రీసత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కార్మికులకు తక్షణ జీతాలు చెల్లించాలని తీర్మానం చేసామన్నారు. కార్మికులకు పే స్లిప్పులు ఇవ్వాలని, రాత్రిపూట విధి నిర్వహణ చేసే కార్మికులకు టార్చ్ లైట్, షూ లను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు చెల్లించాలని, సెలవులలో కార్మికులు పనిచేస్తే అదనపు అలవెన్స్ చెల్లించాలని తీర్మానం చేశామన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు.శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా డేగా ప్రభాకర్, అధ్యక్షులుగా జి. సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా ఆచంట సత్యనారాయణ,కోశాధికారిగా పిల్లి నాగ వీరబాబు, ఉపాధ్యక్షులుగా బొంత వరప్రసాద్, సిహెచ్ పోసి బాబు,ఉప కార్యదర్శిగా టి. రవీంద్ర,ఎం శ్రీనివాస్,కమిటీ సభ్యులుగా డివి రమేష్,డి.వి.చారి,పి.సురేష్, అల్లు రాజు,వి. రేగులయ్య,బి. సురేష్,దాసరి రవి,పి.ప్రసాద్, యు.రవికుమార్,సిహెచ్ సత్యనారాయణ తదితరులను ఎన్నుకున్నారు. నూతన కమిటీని డేగా ప్రభాకర్ అభినందించారు.భవిష్యత్తులో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని, ప్రజా ప్రతినిధి అధికారులు సహకరించాలని కోరారు.

About Author