ఏలూరులో 78వ స్వాతంత్య్ర వేడుకలు
1 min readఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ కనుల పండువగా కార్యక్రమాలు
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారింది గత ప్రభుత్వం చేసిన అరాచకాలను దృష్టిలో వుంచుకొని రాజకీయకక్షలు ప్రేరేపించకుండ గ్రామాల్లో,రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రవర్తించాలని అందరికీ ముఖ్యమంత్రి సూచించడం జరిగిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని. పింఛన్ ను ఒక్కసారిగా రూ.4 వేలు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నమన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్,జేసి పి. ధాత్రీరెడ్డి,డి ఆర్ఒ డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి, ప్రభృతులు పాల్గొన్నారు.