దామోదర ఆయిల్ మిల్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కల్లూరి ఎస్టేట్లోని దామోదర ఆయిల్ మిల్ ( కర్నూల్ ఆయిల్స్) ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా దామోదర ఆయిల్ మిల్ అధినేతలు అయినా మహేశ్వర్ రెడ్డి, రాజేష్ రెడ్డి లు జెండా ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల వల్ల మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయ్యిందని, ఈ ఈ 78 సంవత్సరాల కాలంలో మనం ఆర్థికంగా, వ్యవసాయ పరంగా , పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందామని, ఇంకా చెందాల్సిన అవసరం ఉందని దానికి మనం అందరం నిరంతరం కష్టపడి పని చేసి పనిచేసి భారత దేశ అభివృద్ధిలో మనమందరం భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ స్థాయిలో ఎన్నో విధాలుగా మందంజులో ఉందని, చాలా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు . మీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో దామోదర్ ఆయిల్ మిల్ స్టాప్ అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.