ఘనంగా78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం నాడు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రామేశ్వర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారితో అలుపెరగని పోరాటం చేసి స్వాతంత్రమును సంపాదించి పెట్టారని, ఎందరో కష్టపడి ప్రాణాలు అర్పించి తీసుకువచ్చిన స్వాతంత్రాన్ని మనమందరం క్రమశిక్షణతో, నిబద్దతో, ఓర్పు, సహనంతో భారతదేశం పేరు నిలబెట్టాలని. విద్యార్థులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన వ్యాసరచన వకృత్వ పోటీలలో మరియు ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమములు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు పాఠశాల హెచ్.ఎం. యం.రామేశ్వర రావు , A.O శ్రీ యం. బి. యన్. రాఘవేంద్రరావు , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేశారు.