PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో ఘనంగా 78 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక విట్టల్ నగర్ లోని గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని పాఠశాల ప్రధానాచార్యులు కే .మెహరున్నీసా తెలిపారు .గురువారం ఉదయం పాఠశాల మైదానం లో జరిగిన వేడుకల్లో పాఠశాల కరెస్పాండంట్ మిన్నల్ల,మరియు సీనియర్ ఉపాద్యాయుడు ఎం .కే .రంగస్వామి జాతీయ జెండా ఎగురవేశారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మిన్నల్లా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ పురోభివృద్దికోసం విద్యార్థులపాటుపడాలని చెప్పారు.పాఠశాల ప్రధానాచార్యులు కే .మెహరున్నీసా  మాట్లాడుతూ విద్యార్థులు భావిభారత పౌరులుగా ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని చెప్పారు .అనంతరం విద్యార్థుల ఆటపాటలు ,దేశ నాయకుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి .ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు .

About Author