PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాతృత్వ సాధనకు 8ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన విజయవాడ మహిళ

1 min read

కుచించుకుపోయిన అండాశంయ ఉన్నప్పటికీ  అగ్రగామి ఫర్టిలిటీ కేంద్రంలో ప్రత్యేకించిన చికిత్సల తరువాత.. గర్భం దాల్చిన మహిళ

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  గర్భధారణ సమస్యల కారణంగా సవాళ్లతో కూడిన సుదీర్ఘ ప్రస్థానం తరువాత 29 ఏళ్ల మహిళ భక్తి (పేరు మార్చబడింది) విజయవంతంగా గర్భం దాల్చింది. విజయవాడలోని ఇందిరా ఐవీఎఫ్ లో అత్యాధునిక ఫర్టిలిటీ చికిత్సను తీసుకున్న తరువాత.. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మఇచ్చింది. ఆమె ఎనిమిదేళ్లకు పైగా గర్భధారణ సమస్యలతో ఆమె పోరాడింది. వైద్యపరీక్షల్లో ఆమె అండాశయం కుచించుకుపోయి ఉన్నట్టుగా గుర్తించారు. మరొక ఆస్పత్రిలో గర్భధారణ కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇందులో ఆరుసార్లు అండాశయం నుండి గుడ్డు రావడానికిి వైద్యం తీసుకున్నారు (ovulation induction) మరియు రెండుసార్లు గర్భాశయంలో వీర్యనిక్షేపణ (intrauterine insemination- IUI) కూడా ఉన్నాయి. క్లిష్టతరమైన పరిస్థితులను అధిగమించి, ఇందిరా ఐవీఎఫ్ లోని నిపుణుల సాయంతో ఆమెకు కొత్త ఆశ చిగురించింది. ఇందిరా ఐవీఎఫ్ కేంద్రానికి ఆమె చేరుకునే సమయానికి ఆమె అండాశయం గణనీయంగా కుచించుకుపోయిఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. యాంటీ-ముల్లేరియన్ హార్మోన్ (AMH) స్థాయులు కేవలం 0.9 ng/mL మాత్రమే ఉండడం కారణంగా సహజపద్ధతుల్లో ఆమె గర్భం దాల్చగల అవకాశాలను పరిమితం చేసేశాయి. ఆమె విషయంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకున్న డాక్టర్ కవిత చలసాని నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకోసం ప్రత్యేకించిన ఫర్టిలిటీ చికిత్స ప్రణాళికను సూచించారు. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) అనే అత్యాధునిక విధానం ఆమె విషయంలో గర్భందాల్చే అవకాశాలను పెంచడానికి వినియోగించారు. డాక్టర్ చలసాని మార్గదర్శకత్వంలో ఇందిరా ఐవీఎఫ్ లోని బృందం ఎంతో జాగ్రత్తగా సమన్వయపరచిన చికిత్సా విధానాన్ని అనుసరించారు. ఒక ప్రత్యేకమైన ఓవరియన్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ తో ప్రారంభించి,  అల్ట్రాసౌండ్ మరియు హార్మోన్ పరీక్షలతో కచ్చితత్వంతో సమీక్షించారు. అయిదు మాతృజీవకణాలను (ఊసైట్స్)ను సమీకరించగా, అందులో నాలుగింటిని ICSI ద్వారా సఫలవంతంగా ఫర్టిలైజ్ చేయడం జరిగింది. ఆ రోగి యొక్క గర్భాశయం లోపలి పొరలను ప్రత్యేకంగా సిద్ధం చేసిన తర్వాత  క్రయోప్రిజర్వ్ చేసిన రెండు పిండాలను ప్రవేశపెట్టారు. ఎంతో జాగ్రత్తగా ఖచ్చితత్వంతో చేసిన ఈ విధానం వల్ల గర్భత్వ పరీక్షలు సఫలమై.. అంతిమంగా ఆరోగ్యకరమైన బాబును ప్రసవించడం జరిగింది. విజయవాడలోని ఇందిరా ఐవీఎఫ్ లో గైనకాలజిస్టు మరియు ఐవీఎఫ్ నిపుణులు అయిన డాక్టర్ కవిత చలసాని మాట్లాడుతూ ‘‘ఇవాళ్టి రోజుల్లో గర్భధారణ విషయంలో పెరుగుతున్న సవాళ్లను ఈ కేసు ప్రత్యేకంగా గుర్తు చేసేటువంటిది. రోగి యొక్క వ్యక్తిగతమైన స్థితిగతులను  జాగ్రత్తగా అంచనావేయడం ద్వారా, ఆమెకోసం ప్రత్యేకించిన చికిత్సా విధానం అనుసరించడం ద్వారా.. ఆమె కేసులోని సంక్లిష్టతలను మేం అధిగమించి.. సఫలం కాగలిగాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అండాశయం కుంచించుకుపోయి ఉన్న యువతుల్లో  గత రెండేళ్లుగా మాతృజీవకణాల నాణ్యతలో 5 శాతం తరుగుదల ఉన్నట్టుగా ఇటీవలి పరిశీలనలు చెబుతున్న నేపథ్యంలో ఈ విధానం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ పోకడ గర్భం దాల్చగల అవకాశాలను ప్రభావితం చేయడం మాత్రమే కాదు.. మహిళలు తమ పునరుత్పాదక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన సమయంలో స్పందించాలనే దిశగా వారిలో అవగాహన పెంచవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.

ఇందిరా ఐవీఎఫ్ గురించి.

దేశవ్యాప్తంగా 140 కి పైగా కేంద్రాలతో ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ హాస్పిటళ్ల నెట్ వర్క్ కలిగి ఉన్న సంస్థ ఇందిరా ఐవీఎఫ్. చిత్తశుద్ధితో పనిచేసే 3100 మందికి పైగా ఉద్యోగులతో సేవలందిస్తున్నది. దేశంలోనే అత్యధికంగా  సంవత్సరంలో ఇందిరా ఐవీఎఫ్ 45వేలకు పైగా ఐవీఎఫ్ ప్రొసీజర్ లతో అనన్యమైన ఘనతను సాధించింది. బాధ్యతాయుతమైన నాయకత్వ స్థానంలో ఉన్న ఇందిరా ఐవీఎఫ్, గర్భం దాల్చకపోవడం గురించి ఉన్న అపోహలు, నిందలు, తప్పుడు సమాచారాలు అన్నింటినీ దూరం చేయడంలో కృషిచేస్తున్నది. ఫర్టిలిటీ చికిత్సలు అందించడంలో కొత్త నిపుణులను తీర్చిదిద్దడంలో కూడా ఇందిరా ఐవీఎఫ్ ముందంజలో ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి ఇందిరా ఫర్టిలిటీ అకాడమీ ద్వారా భావసారూప్యతగల సంస్థలు, వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది.  ఇందిరా ఐవీఎఫ్ ను 2011 సంవత్సరంలో, రాజస్తాన్ లోని ఉదయపూర్ లో డాక్టర్ అజయ్ ముర్డియా ప్రారంభించడం జరిగింది.

About Author