PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి నుండి వైసీపీలోకు 80 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్ సీపీ నాయకులు, కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ ఆధ్వర్యంలో 75 కుటుంబాలు టిడిపిని వీడి శుక్రవారం వైఎస్ఆర్సిపిలో చేరాయిమండలంలోని షుగర్ ఫ్యాక్టరీలో కాశీ పట్ల సత్య సాయి నాధ శర్మ ముఖ్య అనుచరుడు తుపాకుల జనార్దన్ రెడ్డి తో పాటు ఆయన ఆత్మీయులు వార్డు మెంబర్ కుమారు తో సహా 35 కుటుంబాలు, అలాగే షుగర్ పార్టీ ఎస్టీ కాలనీలో 25 కుటుంబాలు టిడిపిని వీడి వైఎస్ఆర్ సీపీ నాయకులు కాశీ పట్ల సత్య సాయి నాధ శర్మ సమక్షంలో వైసీపీ లో చేరారు, వీరందరికీ సాయినాధ శర్మ వైఎస్ఆర్సిపి కండువాలు కప్పి పార్టీల్లోనికి ఆహ్వానించారు, అదే విధంగా చెన్నూరు అరుంధతి నగర్ లో 20 దళిత కుటుంబాలు టిడిపిని వీడి కాశీ పట్ల సత్య సాయినాథ శర్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి లో చేరాయి వీరందరికీ సత్య సాయి నాధ శర్మ పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాధారంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరిగిందన్నారు, అంతే కాకుండా ఈ పథకాలు ఏ రాజకీయ నాయకుని వద్దకు ప్రజలు వెళ్లకుండా, పూర్తిగా దళారీ వ్యవస్థను రూపుమాపి, అర్హులు అయితే చాలు పథకాలు వారి ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేర్చడం జరిగిందన్నారు, సంక్షేమ పథకాలే కాకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు తలదన్నే విధంగా రూపు దిద్దడం జరిగిందన్నారు, అలాగే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని భావించి నేడు రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, తద్వారా లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగిందన్నారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందు, పాలన వైయస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అనే విధంగా కొనసాగుతుందంటే ప్రజలు ఆయన పై ఎంత నమ్మకంగా ఉన్నారో ఇప్పటికే ప్రతిపక్షాలకు అర్థం అయి ఉంటుందని ఆయన అన్నారు, రాష్ట్రం పురోగతి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలానీ ఆయన ప్రజలను కోరారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ రఘురాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, బ్రహ్మయ్య, కరుణాకర్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author