80 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి మేజర్ డ్రైన్స్ లలో షిల్డ్ తొలగింపు
1 min readపర్యవేక్షించిన కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ప్రతి దుకాణదారుడు డస్ట్ బిన్స్ తప్పనిసరిగా వినియోగించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : యుద్ధ ప్రాతిపదికన నగరంలో రోడ్లు మరమ్మతులు,మేజర్ డ్రైనేజీల్లో షీల్డ్ తొలగించే పనులు జరుగుతున్నాయని నగరపాలకసంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. ఏలూరు శాసనసభ్యులుబడేటి చంటి,నగరపాలకసంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఆదేశాల మేరకు 80 లక్షల రూపాయలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నగరంలో ప్రధాన రోడ్లుమరమ్మత్తులు,మేజర్ డ్రైనేజీల్లో ఉన్న షిల్ట్ తొలగించడం జరుగుతుందన్నారు.పది రోజుల క్రితం పనులు ప్రారంభించడం జరిగిందని వర్షాలు కారణంగా మధ్యలో పనులు ఆలస్యం అయిందన్నారు.వన్ టౌన్,టూ టౌన్ ప్రాంతాల్లో సుమారు 13 మేజర్ డ్రైనేజీల్లో షిల్టు తొలగిస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల మరమ్మతులు చేస్తున్నామన్నారు. జరుగుతున్న పనులను ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని పెదబాబు అన్నారు.మేజర్ డ్రైనేజీల్లో బ్రాందీ షాపుల దగ్గర సీసాలు,కూల్ డ్రింక్ షాపుల దగ్గర ప్లాస్టిక్ వ్యర్ధాలు పడి ఉండడం కారణంగా డ్రైనేజీలు పూడుకపోయి వర్షపు నీరు రోడ్లపై పొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నయ్యన్నారు. షాపు యజమానులు,ప్రజలు డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేయకుండా కార్పొరేషన్ అధికారులకు,సిబ్బందికి సహకరించాలని, ప్రతి దుకాణదారుడు డస్ట్ బిన్స్ తప్పనిసరిగా వినియోగించాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు ప్రజలను కోరారు. అలాగే డ్రైనేజీలో నుండి తీసిన షిల్టు ఆరిన వెంటనే అక్కడ నుండి తరలించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఇ తాతబ్బాయి, ఏ.ఇ రఫీ, డివిజన్ కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్,దేవరకొండ శ్రీనివాసరావు, నున్న కిషోర్,దారపు తేజ,ఆరేపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.