జిల్లాలో 95.49 శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సాయంత్రం 6 గంటల సమయానికి 95.49 శాతం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో మంచానికే పరిమితమైన బాలుడు హేమంత్, మరొక పెన్షన్ లబ్ధిదారులైన గాజుల లక్ష్మీదేవికి పింఛన్ మొత్తాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అందచేశారు. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అన్ని మండలాలలో సాయంత్రం 6 గంటల సమయానికి 2,06,836 మందికి 87.49 కోట్ల పెన్షన్ల మొత్తాన్ని పంపిణీ చేసి 95.49 శాతం పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.