9 వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు
1 min readకానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 246 మంది అభ్యర్దులు ఎంపిక.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP రెండవ బెటాలియన్ లో 9 వ రోజు దేహదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రోజు 600 మంది అభ్యర్దులను పిలిచారు. 338 మంది అభ్యర్దులు బయోమెట్రిక్ కు హజరయ్యారు.వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.1600 మీటర్ల పరుగు పరీక్షలో 277 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.100 మీటర్ల పరుగు పరీక్షలో 172 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాంగ్ జంప్ లో 237 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.కానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 9 వ రోజు 246 మంది అభ్యర్దులు అర్హత సాధించారు.ఏదైనా సమస్యల పై , ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28 వ తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిస్పీలు, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, డిపిఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.