PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటరు స్లిప్పు లేకపోయినా.. ఓటేయవచ్చు..

1 min read

– జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్
పల్లెవెలుగు, కర్నూలు;
జిల్లాలో బుధవారం జరగనున్న మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో ఓటరు స్లిప్పు లేకపోయినా… రాష్ట్ర ఎన్నికల కమిషన్​ సూచించిన గుర్తింపు .. ఏదో ఒకటి చూపించి.. జాబితాలో పేరున్న ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేని ఓటర్లు తమ ఓటర్ స్లిప్ తో పాటు తమ వెంట క్రింద పేర్కొన్న గుర్తింపు కార్డులో ఏదైనా ఒక దానిని పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయవచ్చన్నారు.
ఓటరు స్లిప్పు తో పాటు ఎస్.ఈ.సి అనుమతించిన ఐడి కార్డుల జాబితా :

  1. ఆధార్ కార్డు
  2. పాస్ పోర్టు
  3. డ్రైవింగ్ లైసెన్స్
  4. పాన్ కార్డు (ఇన్ కమ్ టాక్స్)
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి పరిధిలోని పబ్లిక్ సెక్టారు, స్థానిక సంస్థలు లేదా పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు
  6. ఫోటో గుర్తింపుతో ఉన్న.. పెన్షన్ డాక్యుమెంట్ పత్రం, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పత్రం, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పెన్షన్ ఆర్డర్, మృతి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ భార్య లేదా డిపెండెంట్స్ సర్టిఫికెట్, వృద్ధాప్య/విడో పింఛన్ పత్రం (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  7. ఫోటో గుర్తింపు ఉన్న పట్టా/ పట్టాదారు పాసుబుక్కు, రిజిష్టర్డ్ డీడ్స్ (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  8. ఫోటో గుర్తింపు ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, పోస్టల్, ఆప్కాబ్, డిసిసి, కిసాన్ క్రెడిట్ పాసు పుస్తకాలు.
  9. ఫోటో గుర్తింపుతో ఉన్న ఏటీఎం కార్డులు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  10. ఫోటో గుర్తింపు ఉన్న రేషన్ కార్డు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  11. ఆర్.జి.ఐ. జారీ చేసిన నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ (ఎన్.పి.ఆర్.) స్కీముకు సంబంధించిన స్మార్ట్ కార్డు.
  12. ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. (ఉపాధిహామీ) జాబ్ కార్డు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  13. ఫోటో గుర్తింపు ఉన్న, సంబందిత అధికారిచే జారీ చేయబడిన ఎస్సి/ఎస్టీ/బీసీ ధ్రువీకరణ పత్రాలు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  14. ఫోటోతో ఉన్న.. స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు.
  15. ఫోటోతో ఉన్న అర్మ్స్ లైసెన్సు కార్డులు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  16. ఫోటో గుర్తింపు ఉన్న విభిన్న ప్రతిభావంతుల సర్టిఫికెట్ (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  17. ఫోటో గుర్తింపు ఉన్న బార్ కౌన్సిల్ సభ్యత్వ కార్డు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  18. ఫోటో గుర్తింపు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు (లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జారీ చేసినవి).
  19. సెక్రెటేరియట్ జారీ చేసిన ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ ఫోటో గుర్తింపు కార్డు.
  20. సెక్రెటేరియట్ జారీ చేసిన లోక్ సభ/రాజ్యసభ మెంబర్ల ఫోటో గుర్తింపు కార్డు.
    ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఓటరు సద్వినియోగం చేసుకొని ఓటర్లకు భారత రాజ్యాంగం కల్పించిన పవిత్ర ఓటు హక్కును వినియోగించుకుని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని..ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించాలని, అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ కోరారు.

About Author