PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీపీఎస్​సీ నోటిఫకేషన్​ విడుదల!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: ఆంధ్రపదేశ్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్​(ఏపీపీఎస్​సి) శుక్రవారం వివిధ శాఖల్లో 54 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో ఏపీ ఇన్ఫర్మేషన్​ సర్వీస్​ శాఖలో డీపీఆర్​వో పోస్టులు, సర్వే అండ్​ ల్యాండ్​ సర్వీస్​ శాఖలో అసిస్టెంట్​ డైరెక్టర్​ పోస్టులు, లెజిస్టేచర్​ సర్వీస్​ శాఖలో తెలుగు రిపోర్టర్​, హార్టికల్చర్​ శాఖలో హార్టికల్చర్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్​సి నోటిఫికేషన్​ జారీ చేసింది.
నోటిఫికేషన్​ వివరాలు ఇలా…
= డీపీఆర్‌ఓ పోస్టులు 4( ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభం తేదీ అక్టోబర్ 19, చివరి తేదీ నవంబర్ 11, ఎంపిక కంప్యూటర్​ పరీక్ష ద్వారా ఉంటుంది.
= అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 6(ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ లేదా తత్సమాన అర్హత), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్22 , చివరి తేదీ నవంబర్ 12, ఎంపిక కంప్యూటర్​ పరీక్ష ద్వారా ఉంటుంది.
= తెలుగు రిపోర్టర్ పోస్టులు 5(డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 18, చివరి తేదీ నవంబర్ 8, ఎంపిక కంప్యూటర్ పరీక్ష ద్వారా ఉంటుంది.
= హార్టికల్చర్ ఆఫీసర్​ పోస్టులు 39(హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్), వయసు 18–42ఏళ్లు, దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 11, చివరి తేదీ నవంబర్ 2, ఎంపిక కంప్యూటర్​ పరీక్ష ద్వారా ఉంటుంది.
ఆన్​లైన్​ దరఖాస్తు విధానం ఇలా…
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

About Author