ఆఫ్ఘన్లో మరోసారి బాంబు పేలుడు! వందమందికిపైగా మృతి
1 min readపల్లెవెలుగువెబ్, కాబూల్: ఆఫ్ఘన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. కుందూజ్ గోజర్–ఈ–సయ్యద్ మజీద్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికిపైగా మృతి చెందగా 200మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మసీద్‌లో ప్రార్థనాలు జరిగే సమయంలో బాంబు విస్పోటనం జరగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలముకుంది. షియాల మసీదు లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లుగా తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఆఫ్టన్ దేశం దాడులు, బాంబు విస్పోటనాలతో అట్టుడుకుతోంది. కుందూజ్ మసీద్‌లో జరిగిన బాంబుదాడి నేపథ్యంలో తాలిబన్ల ప్రత్యేక భ్రదతా బలగాలు ఘటన స్థలానికి చేరకుని దర్యాప్తు మొదలుపెట్టాయి.